Nov 26,2022 11:51

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూతురు అనౌష్క సునాక్‌ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్‌- ఇంటర్నేషనల్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఫెస్టివల్‌ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నత్యంలో పాల్గొన్నారు. యూకేలో జరిగే డ్యాన్స్‌ ఈవెంట్స్‌లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్‌, వీల్‌చెయిర్‌ నత్యకారులు, పోలాండ్‌లోని నటరంగ్‌ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్‌ ఈవెంట్‌కు రిషి సునక్‌ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.