Oct 14,2020 17:59

అమరావతి : ప్రముఖ నృత్యకారిణి పద్మశ్రీ శోభానాయుడు మృతి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి కళారంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శోభానాయుడు (64) మంగళవారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. చిన్న వయస్సు నుంచి నృత్యమే జీవితంగా భావించారని, సత్యభామ, పద్మావతి పాత్రలకు వన్నెతెచ్చారని తెలిపారు. కూచిపూడి నృత్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. నాట్యం ద్వారా తాను ప్రసిద్ధి పొందటమే కాకుండా కూడిపూడి నృత్యానికి కూడా దేశవిదేశాల్లో గొప్ప ప్రాచుర్యం తెచ్చిపెట్టారని కొనియాడారు. భారత సమాజంలోని కులవ్యవస్థను, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించిన 'చండాలిక' ప్రదర్శనను కూచిపూడి నృత్యరీతిలోకి మార్చి శోభానాయుడు ఆ పాత్ర చేశారని పేర్కొన్నారు.