Sep 21,2023 21:13

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ (శ్రీ సత్యసాయి జిల్లా) :వినాయక చవితి సంబరాల్లో డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణం మారుతీనగర్‌లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్‌ (25) వినాయకుని విగ్రహం ముందు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రసాద్‌ భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య, రెండు నెలల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా,