ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో విజయవాడ అను హాస్పిటల్ ద్వారా రెడ్డిగూడెం హైస్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రెడ్డిగూడెం గ్రామ సర్పంచి మల్లాది రాణి ప్రారంభించారు . అనంతరం అను హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈసీజీ,గుండె సంబంధిత సమస్యలు మరియు నరాలకు సంబంధించిన వివిధ రకాల పరీక్షలు నిర్వహించి పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ హాస్పిటల్ కు పంపడం జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు. ఈ శిబిరం నందు డాక్టర్ యం. సౌమ్య, డా.నందిని , డా:జరీనా రోగులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వై ఎంపీపీ చాట్ల రాబర్ట్, పిఎసిఎస్ డైరెక్టర్ బత్తుల శ్రీనివాసరెడ్డి, , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉయ్యూరు భరత్ కుమార్ రెడ్డి, పైడిమర్ల శ్రీనివాసరెడ్డి, బత్తుల వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు చాట్ల ఆదియ్య తదితరులు పాల్గొన్నారు.










