Jul 06,2023 15:42

ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు పెడుతున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. గురువారం మండలం పరిధిలోని పెండేకల్లు ఆర్‌ఎస్‌లో జెమ్‌ కేర్‌ కామినేని హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు వివిధ రకాల రోగాలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారి కోసం ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం గ్రామాల దగ్గరకే వచ్చి అన్ని పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందలను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. గతంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల దగ్గర పోవాలంటే చాలా ఇబ్బంది పడే వారమని, ప్రస్తుతం వారు కూడా ప్రతి గ్రామములో ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ డాక్టర్‌ ఎస్వి చంద్రశేఖర్‌, డాక్టర్‌ చెరకు రాఘవేంద్ర, డాక్టర్‌ కృష్ణ డిఏంఓ, డీజీఏమ్‌ రమణ బాబు, సీనియర్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బీపీ, షుగర్‌, రక్త పరీక్షలను చేయించుకున్నారు.