Jan 19,2023 14:26

ప్రజాశక్తి - కపిలేశ్వరపురం (కాకినాడ) : కపిలేశ్వరపురం మండలంలోని అంగర రాజమ్మ కాలనీలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో 104 సిబ్బంది గురువారం 147 మందికి వైద్య సేవలు అందజేశారు. పీహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ పి.ఎన్‌.ఎస్‌.డి. రత్నకుమారి డాక్టర్‌ జె.ఎ.ప్రియాంక పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో గర్భిణీలను, బాలింతాలను, చిన్నపిల్లలను, కిషోర్‌ బాలికలను, షుగర్‌, బి.పి. వ్యాధిగ్రస్తులను పరీక్షించి, అవసరమైన వారికి రక్త, మూత్ర పరీక్షలను నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.ఇ.- బి.రామారావు, సూపర్‌ వైజర్స్‌ పి.సురేష్‌, టి. మేరీమణి, ఎం.ఎల్‌.హెచ్‌. పి.దేవి, రమాదేవి ఆరోగ్యకార్య కర్తలు, వెంకటేశ్వర్లు , జి.వి.వి.లక్ష్మి, దుర్గ ఆశ కార్య కర్తలు,వెంకటలక్ష్మి, మేరీ, భవాని, విజయ, శ్రీదేవి, అంగన్వాడీ టీచర్‌ గౌరీ తదితరులు పాల్గొన్నారు.