ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (అంబేద్కర్ కోనసీమ) : గర్భిణీ స్త్రీలు ప్రతినిత్యం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారని డాక్టర్ పి.రత్నకుమారి, జె.అనుజ ప్రియాంకలు అన్నారు. సోమవారం కపిలేశ్వరపురం మండలంలోని అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు పి.రత్నకుమారి, జె ప్రియాంక ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతఅత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగర పి హెచ్ సి లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో 25 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హైరిస్క్ గా ఉన్న ఏడుగురు గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్య సేవలు, లేబరేటరీ పరీక్షలు జరిపి వారికి మందులను అందజేశారు . అనంతరం గర్భిణీలు తీసుకోవలసిన పౌష్టికాహారం, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత , ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను హెల్త్ ఎడ్యుకేటర్ బి.రామారావు వివరించారు. వైద్య పరీక్షలకు హాజరైన గర్భిణీలకు అంగర గ్రామానికి చెందిన ఎఎన్‌ఎం జి. వి. వి. లక్ష్మి పలురకాల పండ్లును అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పి.సురేష్, టి.మేరీమణి , ఎంఎల్ హెచ్ పి ఎన్.దేవి, స్టాఫ్ నర్స్ జి.నవ్య, లాబ్ టెక్నీషియన్ ఆలీ, ఏఎన్‌ఎం లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు.










