ప్రజాశక్తి-విజయవాడ సెంట్రల్ : దేశాన్ని అప్పులు పాలు చేసి, పేదల ఆకలి చావులకు కారణమైన కార్పొరేటు భూతాన్ని దీపావళి పండుగ సందర్భంగా ఎల్ బి ఎస్ నగర్ రెడ్డి కూరగాయల కొట్టు సెంటర్ వద్ద డివైఎఫ్ఐ విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సెంట్రల్ సిటీ కార్యదర్శి షేక్ నిజాముద్దీన్ మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజు దీపావళి అని, పాలించే పాలకులలో మాత్రం మార్పులురావటం లేదని అన్నారు. ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల ధనార్జన దాహామే కారణం అన్నారు. విద్యా, వైద్యం లాంటివి కూడా ఈరోజు సరుకుగా మారి పేద వాడికి అందని ద్రాక్షగా మారిందన్నారు. మనిషికి కావాల్సిన కూడ, గూడు, విద్యా, వైద్యం ఉపాధి కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. అవినీతి అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదముతో పనిచేస్తుందని అన్నారు. యువత సమాజ మార్పుకు నిరుద్యోగం అంతం కోసం ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దానికి యువత,పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంటర్ సిటీ అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు కూరపాటి నాగరాజ్, నాయకులు జై నాగరాజ్, ఎస్కే రసూల్, మహేష్, టీ నాగరాజ్ పాల్గొన్నారు










