ఇంటర్నెట్‌డెస్క్ : భారతదేశంలో మధమేహస్తులు రాబోయే కాలంలో మరింత పెరగనున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. తాజా మెటాబలిక్ హెల్త్ నివేదికలో భారతదేశ జనాభాలో రాబోయే కాలంలో 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడనున్నారని అంచనా వేసింది. గతంలో మెటాబాలిక్ హెల్త్ అధ్యయనాల్లో 70 మిలియన్లుగా ఉన్న జనాభా.. రాబోయే కాలంలో 100 మిలియన్లకు పైగా చేరనుందని ఈ అధ్యయనం వెల్లడించింది. అంటే గతం కంటే 44 శాతం ఎక్కువగా మధుమేహస్తులు పెరగనున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత్‌లో అదనంగా 136 మిలియన్ల మందికి ప్రీ డయాబెటిస్ ఉంది. ఇది రాబోయే కాలంలో డయాబెటిస్‌కి దారితీస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
కాగా, ఈ విషయంపై చైన్నైలోని ఎండిఆర్‌ఎఫ్ (మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్)కి చెందిన పరిశోధకుడైన మోహన్ మాట్లాడుతూ.. 'ప్రీ డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ మధుమేహం రాకపోవచ్చు. కానీ భారతీయులు, దక్షిణాసియన్లలో ప్రీ డయాబెటిస్ నుండి డయాబెటిస్‌కి మారే రేటు ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉంది' అని అన్నారు. ఇక భారత్‌లోని బెంగాల్‌లో ఉన్న లక్ష మంది జనాభా రక్తంలో చక్కెర, రక్తపోటు ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయివంటివి నమూనాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ నమూనాల్లో 137 శాతం మందికి డయాబెటిస్ ఉంది. 23.5 శాతం మంది ప్రీడయాబెటిస్, 42.4 శాత మంది అధిక రక్తపోటు, 27 అధిక కొలెస్ట్రాల్ ఉంది. ఈ తాజా నివేదికనుబట్టి రాబోయేకాలంలో మధుమేహం వ్యాధికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే.. 'ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర చాలా అవసరం అని' ఎండిఆర్‌ఎఫ్ అధ్యక్షులు ఆర్.ఎం. అంజన తెలిపారు. ఈ అధ్యయనం ద లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండిక్రినాలజీ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో 4.8 శాతం మధుమేహ రేటు నమోదైతే.. గోవాలో అత్యధికంగా 26.4 శాతం నమోదైంది.