Jan 21,2021 11:32

విజయవాడ: తమను అక్రమంగా హోటల్‌ నుంచి బయటకు రాకుండా హౌస్‌ అరెస్ట్‌ చేసిన రాష్ట్ర డిజిపి గౌతమ్‌ సవాంగ్‌పై పార్లమెంట్‌లో ప్రివిలేజ్‌ మోషన్‌ పెట్టి చర్యలు తీసుకుంటామని బిజెపి ఎంపి సిఎం రమేష్‌ తెలిపారు. డిజిపి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా కాక వైసిపి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విగ్రహాల ధ్వంసం కేసులో బిజెపి కార్యకర్తల ప్రమేయం ఉందని డిజిపి చేసిన వ్యాఖ్యలను వెనిక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిజిపి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణలు చెప్పాలని గత కొద్ది రోజులుగా డిమాండ్‌ చేస్తున్న బిజెపి నేతలు ఈరోజు విజయవాడకు చేరుకున్నారు. బిజెపి ముఖ్యనేతలంతా ఈరోజు విజయవాడకు చేరుకోగా ఎక్కడిక్కడ పోలీసులు వారిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వీరంతా డిజిపి ఆఫీసు ముట్టడికి యత్నించబోతున్నారని సమాచారం రావడంతో పోలీసులు ముందుజాగ్రత్తగా వారిని హౌస్‌ అరెస్ట్‌లు చేశారు.