Jan 13,2023 22:29

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలల పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం, మచిలీపటుం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించారు. వీటి నిర్మాణ పనులను సాధ్యమైనం త్వరగా పూర్తి చేయాలని అనాురు. వీటి నిర్మాణ పనులకుప్రభుత్వ పరంగా విడుదల చేయాల్సిన నిధులను ఏమాత్రం జాప్యం చేయకుండా విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. అవసరమైన నిధులను వచ్చే ఏడాది బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిగేలా చూడాలని చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులను క్లెయిమ్‌ చేసేందుకు పెండింగ్‌లోనున్న బిల్లులను క్లియర్‌ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకుసంతృప్తికరస్ధాయిలో ఆరోగ్యపథకం అమలుకుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకుడాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నూతన వెబ్‌సైట్‌, మొబైల్‌యాప్‌లను రూపొందించే పనులను తక్షణమే చేపట్టాలన్నారు.

  • మహా ప్రస్ధాన వాహనాలు ఎన్‌జిఓలకే:

మహా ప్రస్ధానం వాహనాలతో పాటు 104, 108 సేవలను కూడా సిఎస్‌ సమీక్షించారు. మహా ప్రస్ధానం వాహనాల నిర్వహణా బాధ్యతలను ఎన్‌జిఓలకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఇంకా సిఎస్‌ఆర్‌ నిధులను వెచ్చించేందుకు పిఎస్‌యులతో పాటు ఎన్‌జిఓలను, ప్రైవేటు ఏజెన్సీలను గుర్తించాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు జె.నివాస్‌, ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌డి.మురళీధర్‌రెడ్డి, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు సిఇఓ హరీంధర ప్రసాద్‌, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గనాురు.