Sep 28,2023 12:34
  • తగిన శాస్తి జరిగిందంటూ చెప్పులతో కొట్టుకొని నిరసన తెలిపిన ఉద్యోగులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ఎపిసిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జిపిఎస్ బిల్లు కాపీలను సిపిఎస్ ఉద్యోగులు దగ్ధం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి పాత పెన్షన్ హామీ నమ్మి అధికారం ఇచ్చినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అంటూ ఉద్యోగులు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆర్ శివకుమార్ మాట్లాడుతూ సిపిఎస్ విధానం కన్నా జిపిఎస్ విధానం మరింత లోపం భూష్టమైనదిని అన్నారు. సిపిఎస్ ఉద్యోగులు డబ్బులు తీసుకుని వారికి పెన్షన్ ఇవ్వడం కాదు ప్రభుత్వమే వారికి పెన్షన్ ఇవ్వాలన్నారు. అది వారి హక్కు అని అన్నారు. సిపిఎస్ ఉద్యోగుల డబ్బు తనఖాగా చూపి ప్రతి సంవత్సరం తీసుకొస్తున్న 4000 కోట్ల రూపాయలు అప్పును ప్రజాస్వామ్యంగా వాడుకుంటున్నది ఈ ప్రభుత్వమాన్నారు. ప్రధాన కార్యదర్శి కే. ధనుంజయ మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్ రెండు వద్దు హామీ ఇచ్చిన పాత పెన్షన్ మాత్రమే కావాలని మేము కోరుతున్నా బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు. మాపై జిపిఎస్ విధానం సరైనది కాదని ఇది నిరంకుసంగా ఉందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించకపోతే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్  జిల్లా నాయకులు కంది ఈశ్వరరావు, గంటా త్రినాధ్, శైలాడ అప్పలనాయుడు, కే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.