Oct 11,2023 16:41
  • డిఎస్పీ లతా కుమారి

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ : సామర్లకోట పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం 7 గంటల నుండి ట్రాఫిక్ ను వేరే మార్గాల గుండా మల్లిస్తున్నట్టు పెద్దాపురం డిఎస్పీ లతా కుమారి తెలిపారు. బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలుపుతూ గురువారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4  గంటల వరకు  ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రజలు, భారీ వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పూర్తి సహకారాన్ని అందించాలని ఆమె తెలిపారు. కాకినాడ వైపు నుండి సామర్లకోట వైపునకు వచ్చే భారీ వాహనాలన్నీ అచ్చంపేట జంక్షన్ నుండి తిమ్మాపురం, పిఠాపురం  బైపాస్ మీదుగా కత్తిపూడి హైవేకు దారి మళ్ళించడం జరిగిందని తెలిపారు. కాకినాడ, మాధవపట్నం వైపు నుండి వచ్చే హెవీ వెహికల్స్ ఉండూరు బ్రిడ్జి డౌన్ జంక్షన్ నుండి అచ్చంపేట బైపాస్ రోడ్డు  మీదుగా దారి మళ్ళింపు చేశామన్నారు. సామర్లకోట అయిదు తూముల సెంటర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కటాఫ్ పెట్టుకుని ఉండూరు వైపు నుండి  వచ్చే వాహనాలను మాధవపట్నం వైపునకు దారి మళ్ళిస్తున్నట్టు తెలిపారు. ఇంకా బిక్కవోలు, అనపర్తి వైపు నుండి  సామర్లకోట వైపుకు వచ్చే భారీ వాహనాలన్నీ బిక్కవోలు, భలభద్రపురం  మీదుగా దారి మళ్ళింపు చేశామని, రాజానగరం వైపు నుండి వచ్చే భారీ వాహనాలు పెద్దాపురం పాండవుల మెట్ట వద్దనుండి గుర్రాల సెంటర్ మీదుగా జగ్గంపేట హైవేకు  దారి మళ్ళింపు జరిగిందని తెలిపారు. 
ఆర్టీసీ బస్ లు సామర్లకోట బస్ స్టాండ్ కు వచ్చి తిరిగి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పెద్దాపురం ఎడిబి రోడ్డు మీదుగా వేళతాయన్నారు. అలాగే జగ్గంపేట నుండి వచ్చే ఆర్టీసీ బస్ కు, కార్లు, ఆటొలు, మోటార్ సైకిళ్లపై ప్రయాణించే ప్రయాణీకులు జగ్గంపేట ఏడీబీ రోడ్డు మీదుగా కాకినాడ వైపునకు మళ్ళించడం జరిగిందన్నారు. ప్రత్తిపాడు నుండి కాకినాడ వెళ్ళే వాహనాలు దివిలి, విరవాడ ఎఫ్ కె పాలెం (పక్రుద్దీన్ పాలెం) సెంటర్ మీదుగా     పిఠాపురం నుండి కాకినాడ వైపు గాని, ఎఫ్ కే పాలెం ( పక్రుద్దీన్ పాలెం) సెంటర్ నుండి చంద్రంపాలెం, గొంచాల  మీదుగా గానీ  కాకినాడ వైపునకు దారి మళ్ళించడం జరిగిందన్నారు. ఇంకా ఎఫ్ కే పాలెం (పక్రుద్దీన్ పాలెం) సెంటర్ లో నుండి సామర్లకోట వచ్చే వాహనాలు సీఏం కార్యక్రమం నిమిత్తం వచ్చే వారికి మాత్రమే అనుమతించి మిగిలిన వాహనదారులకు అనుమతి రద్దు చేసినట్టు డిఎస్పీ తెలిపారు. పిఠాపురం బైపాస్ రోడ్డు, పాదగయ జంక్షన్ నుండి సామర్లకోట కాకినాడ, గొల్లప్రోలు రోడ్డులో మీదుగా మళ్ళిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ, కత్తిపూడి నుండి వచ్చే వాహనాలు సామర్లకోట  వైపునకు రాకుండా తిమ్మాపురం, వై జంక్షన్ వద్దనుండి దారి మళ్ళించినట్టు తెలిపారు. రాజానగరం, రంగంపేట వైపు నుండి కాకినాడ వచ్చే భారీ వాహనాలను జగ్గంపేట, కత్తిపూడి మీదుగా దారి మళ్ళించినట్టు తెలిపారు. భలభద్రపురం నుండి సామర్లకోట వైపునకు వచ్చే భారీ వాహనాలను అనపర్తి , మండపేట నుండి కాకినాడ వైపునకు దారి మళ్ళించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి సభకు సామర్లకోట కు వచ్చేవాహనాలకు  మాత్రమే ఊరిలోనికి అనుమతి ఉందని మీటింగ్ ప్రదేశానికి వాహనాలు తమకు నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలుపుకోవాలని, వాహనదారులు, జిల్లా ప్రజలు ఈ ప్రకటన ద్వారా ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు పార్కింగ్ స్థలాల వివరాలను గమనించి సహకరించాలని తెలిపారు.

  • పార్కింగ్ ప్రదేశాలు ఇవి :

సీఎం సభకు విచ్చేసి వాహనాలకు సభందించి పెద్దాపురం రోడ్డులోని స్వర్ణ దేవాలయం దగ్గర (భారత్ పెట్రోల్ బంక్ )వద్ద, పెద్దాపురం సుదా ఆయిల్ మిల్లు దగ్గరలో గల హీరో షో రూమ్ పక్కన గల ఖాళీ ప్రదేశంలోనూ, జి.రాగంపేట గ్రామం గణేష్ కాలనీ పిల్లి సూరిబాబు లే ఔట్ (ఫైర్ క్రాకర్స్ షాపు దగ్గర) వాహనాలకు పార్కింగ్ ప్రాంతాలుగా కేటాయించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. ఆటోలకు సామర్లకోట టిటిడిసి శిక్షణ కేంద్రంలోనూ, పిఠాపురం రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా, సామర్లకోట ఇండస్ట్రియల్ ఎస్టేట్ (విమల్ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ దగ్గర) పార్కింగ్ జరుగుతుందని తెలిపారు. కాగా పోలీస్ అధికారుల వాహనాలు మాత్రం సామర్లకోట పోలీస్ స్టేషన్ పక్కన గల క్వార్టర్స్ నందు, జెడ్పీ బాలికల ఉన్నత పాటశాలలో కార్లు, కొట్లమ్మ చెరువు వద్దగల వాటర్ ట్యాంకుల వద్ద మోటారు సైకిళ్ళు పార్కింగునకు కేటాయించడం జరిగిందని తెలిపారు. బస్సుల పార్కింగు నాకు పెడ్డమిల్లు ఆవాల లక్ష్మీనారాయణ గృహం ఎదురుగా, ఇంకా కార్లు, ఆటోల పార్కినునకు స్థానిక ఇస్మాయిల్ నగర్ వద్దగల వివేకానంద పాటశాల వద్ద ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ విషయాలను వాహనదారులు, జిల్లాలోని ప్రజలు, ప్రయాణీకులు గమనించి సహకరించాలని డిఎస్పీ లతా కుమారి తెలిపారు.