Aug 13,2022 16:21

ప్రజాశక్తి-వత్సవాయి : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని  వత్సవాయి మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వం భావనకు ప్రతీక భారతదేశమని, వేలాది కులాలు, వివిధ మతాలు, వందలాది భాషలు కలయిక భారత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రజలందరి పై ఉందని ఎన్టీఆర్ జిల్లా కౌలురైతు సంఘం కార్యదర్శి  సిహెచ్ సైదులు అన్నాడు. ప్రజాసంఘాల  ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు స్వాతంత్రాన్ని ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని కోరుతూ జాతీయోద్యమ జాతీయ నాయకుల ఫోటోలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పీఠికను సీఐటీయు నాయకులు బి.రాము చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కుటుంబరావు, రైతు సంఘం నాయకులు సిహెచ్ హనుమంతరావు మండల కార్యదర్శి టి.రాంబాబు కౌలురైతు సంఘం నాయకులు టి.రమేష్ ,జాన్ కోటయ్య వెంకటరత్నం డప్పు కళాకారుల సంఘం నాయకులు ఆదాం,ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.