Mar 23,2023 21:34

న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ లైట్‌ ఫ్లై-వెయిట్‌ విభాగం ఫైనల్లోకి హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రవేశించింది. గురువారం జరిగిన 50కిలోల విభాగం సెమీఫైనల్లో నిఖత్‌ 5-0పాయింట్ల తేడాతో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, కొలంబియాకు చెందిన ఇంగ్రిట్‌ వలెన్సియాను చిత్తుచేసింది. 2022లో 52కిలోల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌ ఈసారి 50కిలోల కేటగిరీలో బరిలోకి దిగి వెలెన్సియాపై బలమైన పంచ్‌లతో ఎదురుదాడి చేసి టైటిల్‌పోరుకు సిద్ధమైంది.