Jun 11,2023 14:47

విజయవాడ: నగరంలో మహిళా బాక్సింగ్‌ కోచ్‌పై కొంతమంది యువకులు దాడి చేశారు. శనివారం రాత్రి లయోలా కాలేజీ ఎదుట ఉన్న హౌటల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాక్సింగ్‌ కోచ్‌ రమ్య హౌటల్‌ రూమ్‌ నుంచి కిందకు దిగుతున్న సమయంలో పక్క గదిలో ఉన్న ఆరుగురు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. రమ్య ప్రతిఘటించడంతో.. ఆమెపై దాడి చేశారు. ఇది చూసి.. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన మరో లేడీ కోచ్‌, ఆమె సహాయకుడు వినరుపైనా దాడికి దిగారు. వినరును పక్కనే ఉన్న గాజు డోర్‌కేసి కొట్టడంతో, అతని తలకి బలమైన గాయమైంది. హౌటల్‌ సిబ్బంది సమాచారంతో అక్కడకు చేరుకున్న మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.