నడక ఒక సహజమైన చర్య. ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా చేసే వ్యాయామం కూడా. అంతేకాదు మనం పనిమీద ఊరు వెళ్లినా, ఉదయం వేళ కుదరకపోయినా.. వీలుచేసుకుని ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఈ వ్యాయామం చేయవచ్చు. అయితే ఖాళీ కడుపుతో చేయడం అనేది ఆరోగ్యం. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరంలోని అనేక కండరాలు దీనికి ప్రతిస్పందిస్తాయి. నడక వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయి. నష్టాలు చాలా చాలా తక్కువ. సాధారణం కంటే ఎక్కువ వేగంగా, ఎక్కువ దూరం నడవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. అందుకే బద్ధకించకుండా రోజూ కనీసం అరగంటైనా నడవండి.
1. గుండెకు మంచిది
నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వేగంగా నడవడం వల్ల గుండెకు, శ్వాసవ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. ఏంగ్జయిటీ, డిప్రెషన్‌తో బాధపడేవారికి నడక మరింత మంచిది.
2. ఎముకలకు బలం
నడవడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారతాయి. కొందరిలో ఎముకలు పెళుసుగా మారడాన్ని నడకతో నివారించవచ్చు.
3. కండరాలు పటిష్టపడతాయి
రోజూ నడిస్తే శరీరంలోని కండరాలు పటిష్టంగా మారతాయి. నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాదు శరీరానికి సరైన ఆకృతి వస్తుంది.
4. కేలరీలు తగ్గుతాయి
బరువు తగ్గడానికి నడక ఒక మంచి మార్గం. నడక వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గవచ్చు.
5. చక్కెరస్థాయిల నియంత్రణ
నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిల్ని అదుపుచేయొచ్చని అనేక అధ్యయనాల్లో తేలింది. నడక వల్ల కొవ్వు పేరుకోదు. గుండెజబ్బులు, డయాబెటిస్, కాలేయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవడమే కారణం. ఇన్సులిన్‌కు శరీరం స్పందించే తీరునూ నడక మెరుగుపరుస్తుంది.
6. జీవితకాలం పెరుగుతుంది
నడక జీవితకాలాన్ని పెంచుతుంది. నడక వల్ల 16-20 ఏళ్లు అదనంగా జీవించవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే, మరణాన్ని అంత దూరంగా తరిమేయవచ్చు.
7. మానసిక ప్రశాంతత
నడక కేవలం శరీర దారుఢ్యాన్ని పెంచడమే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక స్థితీ బాగుంటుంది.
8. విటమిన్ 'డి' లభిస్తుంది.
ఉదయం వేళ నడవడం వల్ల శరీరంలో విటమిన్ 'డి' స్థాయి పెరుగుతుంది. శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తవుతుంది.
9. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
ఆనకట్ట పక్కన నడవడం వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు మెరుగవుతాయి. ఈ యాంటీబాడీల వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. లాలాజలం ఉత్పత్తిలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు, అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
10. పేగుల ఆరోగ్యానికి..
చురుకైన నడక వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే, ఇది పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుంది. నడక వల్ల జీర్ణశక్తి, రోగ నిరోధకశక్తి పెరుగుతాయి.
ఏముండాలి.. ఎలా చేయాలి..
ఙనడిచేందుకు సౌకర్యవంతమైన బూట్లు ఉంటే చాలు. అలాగే శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. ఒకవేళ ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకుంటే సరైన బూట్లు, దుస్తులు తప్పనిసరి. మంచి బూట్లు ధరించడం వల్ల నడుముపై ఒత్తిడి పడదు. మోకాళ్లు, చీలమండలంపైనా ఒత్తిడి లేకుండా ఉంటుంది.
- తొలుత నెమ్మదిగా నడక మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి. గంటకు 6.4 కి.మీ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు నడవడం ప్రయోజనకరం. ఏదైనా వాకింగ్ గ్రూపులో చేరితే రోజూ నడవాలనే ఉత్సాహం కూడా వస్తుంది.
- ఒక్కసారి మీరు నడవాలని నిర్ణయించుకున్న తర్వాత అది మీ జీవనశైలిలో భాగమైపోవాలి.
- ఇటీవలి కొన్ని పరిశోధనల ప్రకారం, మహిళలైతే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య నడిస్తే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- అన్నింటికంటే రోజంతా చురుగ్గా ఉండటానికి నడక మంచిమార్గం. నడక ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే నడక మంచిదే..