Feb 05,2023 09:11
  • భారత్‌-డెన్మార్క్‌  డేవిస్‌ కప్‌ ప్లే-ఆఫ్‌

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ ప్లే-ఆఫ్‌లో భాగంగా డెన్మార్క్‌తో జరుగుతున్న పోటీల్లో భారత్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో యుకీ బాంబ్రి ప్రపంచ 9వ ర్యాంకర్‌ హౌల్గర్‌ రూనీ చేతిలో 2-6, 2-6తో ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్‌ 0-1తో వెనుకబడింది. రెండో సింగిల్స్‌లో సుమిత్‌ సంచలనానికి తెరలేపాడు. రెండో సింగిల్స్‌లో సుమిత్‌ 4-6, 6-4, 6-4తో డెన్మార్క్‌ యువ ఆటగాడు అగస్ట్‌ హౌల్‌గ్రీన్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌ 2గంటల 27నిమిషాలసేపు సాగింది. ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ 506, హౌల్మ్‌గ్రీన్‌ 484వ ఉన్నారు. నేడు పురుషుల డబుల్స్‌, రేపు రివర్స్‌ సింగిల్స్‌ పోటీలు జరగనున్నాయి.