ప్రజాశక్తి-ఉంగుటూరు (నెల్లూరు) : ఉంగుటూరు సింహపురి మాయేంద్రజాల్ మేజిక్ ఫెస్టివల్ నెల్లూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల నుండి పలువురు మేజిషియన్స్ పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రావులపర్రుకు చెందిన అన్నెపు దేవేంద్ర అప్పారావు తన మేజిక్ ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ప్రదర్శన అనంతరం నిర్వాహకులు దేవేంద్రకు సన్మానంతో పాటు జ్ఞాపికను అందించి అభినందించారు.










