Feb 04,2023 21:50

క్వార్టర్స్‌లో పంజాబ్‌పై 71పరుగుల తేడాతో గెలుపు
రాజ్‌కోట్‌: రంజీట్రోఫీ సెమీఫైనల్లోకి సౌరాష్ట్ర జట్టు ప్రవేశించింది. శనివారంతో ముగిసిన నాల్గో క్వార్టర్‌ఫైనల్లో సౌరాష్ట్ర జట్టు 71పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. రంజీట్రోఫీ అరంగేట్రం బౌలర్‌ పార్థ్‌ భట్‌(5/89) బౌలింగ్‌లో మెరిసాడు. సౌరాష్ట్ర బౌలర్లు చెలరేగడంతో 252పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ జట్టు 180పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర జట్టు 303 పరుగులు చేస్తే.. పంజాబ్‌ 431 పరుగులు చేసింది. అనంతరం సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 379పరుగులు చేసింది.
8న జరిగే సెమీస్‌ఫైనల్స్‌
మధ్యప్రదేశ్‌ × బెంగాల్‌
సౌరాష్ట్ర × కర్ణాటక