న్యూఢిల్లీ : ఎస్‌ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. దీంతో తమ వినియోగదారులకు 3-ఇన్-1 ఖాతాలు అందించనున్నామన్నారు. తమ బ్యాంక్ వినియోగదారులకు ఆన్‌లైన్‌లో సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ సేవలు అందించనున్నామని పేర్కొంది. ప్రస్తుతం తమ బ్యాంక్‌కు 76 లక్షల మంది పైగా వినియోగదారులున్నారని వెల్లడించింది.










