Feb 04,2023 15:16

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల టీ20 భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సంచనల వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వారి వయసు, ఫామ్‌ని బట్టి భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్‌ ఆడతారా అనేది ప్రశ్నగా మారిందన్నాడు. ప్రపంచకప్‌ వరకు రోహిత్‌, విరాట్‌ ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు వారికి విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చు. అయితే భవిష్యత్తును ఒకసారి పరిశీలిస్తే మాత్రం టీ20ల్లో కేవలం యువకులే ఉంటారు. తర్వాతి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ ఆడతాడని నేను అనుకోవట్లేదు. విరాట్‌కి కూడా అవకాశాలు తక్కువే. కానీ రోహిత్‌ మాత్రం కచ్చితంగా ఆడడు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36. అందువల్ల వచ్చే టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు ఎంత ఫిట్‌గా ఉంటాడో ఎలాంటి ఫామ్‌ని కొనసాగిస్తాడో చూడాలన్నాడు.