Sep 13,2023 16:09

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాలలో విగ్రహల ఏర్పాటు చేయడానికి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామాలలో వినాయక స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసే వారు స్థానిక ఎస్సై నుండి అనుమతుల పొందిన అనంతరం విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తారో అంతమంది అనుమతులు పొందాలని తెలిపారు. విగ్రహాలు ఏర్పాటులో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న కమిటీ సభ్యులు బాధ్యులవుతారని తెలియజేశారు.