- చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ములాఖత్ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీ కలిసే ఎన్నికలకు వెళ్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ అరాచకత్వాన్ని దోపిడీలను ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే సరిపోదని కాబట్టి టీడీపీ,బీజేపీ,జనసేనతో కలిసి వెళ్తే మంచిదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో మరో రెండు దశాబ్ధాలపాటు ఈ అరాచక పాలన కొనసాగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆయనపై పెట్టిన కేసులన్ని అక్రమమేని.. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.
- చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ములాఖత్ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆయనపై పెట్టిన కేసులన్ని అక్రమమేని.. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారన్నారు.
- చంద్రబాబుతో పవన్ కల్యాణ్, బాలకృష్ణ ములాఖత్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రాజమండ్రికి చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును వీరు ములాఖత్ ద్వారా కలవనున్నారు. వీరితో పాటు నారా లోకేష్ కూడా జైలుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నారు. కాసేపటి క్రితమే మధురపూడి గెస్ట్ హౌస్ నుంచి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. చంద్రబాబుతో సమావేశానంతరం నారా భువనేశ్వరిని పవన్ పరామర్శించనున్నారు. ఇందుకోసం ఈరోజు ఉదయం బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు వేర్వేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాజమండ్రి చేరుకున్న బాలకృష్ణ.. లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు బస చేస్తున్న చోటుకు వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం బాలకృష్ణ, లోకేష్ కలిసి ఒకే కారులో రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. అయితే వారి కారును జైలు మెయిన్ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్ చేరుకున్నారు. అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఆ తర్వాత పవన్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కలిసి నడుచుకుంటూ జైలులోనికి వెళ్లి చంద్రబాబును కలిశారు.










