- ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు
- ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే నివాసం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాలపై ఇక నిరంతర పర్యవేక్షణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోరది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ఇప్పటికే పలు శాఖల అధికారులకు సూచనలు కూడా వెళ్లినట్లు తెలిసింది. సచివాలయాల్లో పనిచేసే వారు అనుసరించాల్సిన విధానాలపైనా స్పష్టతనిచ్చింది. త్వరలోనే మరికొన్ని అదనపు బాధ్యతలు కార్యదర్శులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిరది. సచివాలయాలపై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఎంపిడిఒలకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు వారి పైస్థాయిలో కూడా మరింత బలోపేతమైన వ్యవస్థపై కసరత్తు ప్రారంభించిరది. ఇందులో కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా పాత్రధారులను చేసేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఖాళీగా ఉన్న 25 డివిజన్ స్థాయి అధికారుల పోస్టులను భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. వారితోపాటు, ఎంపిడిఒలు, పంచాయతీ కార్యదర్శులకు అధికారాలను కట్టబెట్టే ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అదనపు బాధ్యతలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సుస్థిరాభివృద్ధి సూచికల అమలుపై కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం తాజాగా డ్రాపౌట్స్‌ను గుర్తించే కార్యక్రమాన్ని కూడా వారికి అప్పగించాలని నిర్ణయించిరది. ఐటిఐ, పాలిటెక్నిక్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నర్సింగ్ కళాశాలల విద్యార్థుల హాజరు, పైస్థాయి విద్యకు వెళ్తున్న విధానాలపై వివరాలు సేకరించి వాటిని గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోలో నమోదు చేయాలని నిర్ణయించిరది. ఈ బాధ్యతలను కార్యదర్శులకు అప్పగించాలని భావిస్తుంది. ప్రతి 15 రోజులకోసారి వార్డు, గ్రామ సచివాలయాలను సందర్శించే అధికారుల అధ్యయన వివరాలను నమోదుచేసేందుకు యాప్‌ను అప్‌డేట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కార్యదర్శులు, శాఖాధిపతులు 15 వేల వార్డు, గ్రామ సచివాలయాల పర్యటనలను డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు.










