ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాలకుల అక్రమాలకు అడ్డుచెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుందని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు. చంద్రబాబు గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని, ఆయనను అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పాలని కోరారు. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాలపాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించాలని పిలుపునిచ్చారు. ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని కోరారు.










