Jun 09,2023 22:24
  • తప్పు జరగడం నేను చూశా
  • అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్‌ సింగ్‌
  • బ్రిజ్‌ భూషణ్‌ ఇంటికి రెజ్లర్‌ సంగీతా పోగట్‌ ను తీసికెళ్లిన ఢిల్లీ పోలీసులు
  • రాజీకి రెజ్లర్లంటూ మీడియా కథనాలను ఖండించిన రెజ్లర్లు
  • రెజ్లర్లు విద్వేష ప్రసంగాలు చేయలేదు : ఢిల్లీ పోలీసులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ ఆగడాలను ఒక్కొక్కరు బయట పెడుతున్నారు. మొన్న కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతాకం సాధించిన రెజ్లర్‌ అనిత కొన్ని సాక్ష్యాలను బయటపెట్టారు. తాజాగా అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్‌ సింగ్‌ మరికొన్ని అంశాలను బయటపెట్టారు. అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ 'బ్రిజ్‌ భూషణ్‌ ఆమె పక్కన నిలబడి ఉండటం చూశాను. ఆమె తనను తాను విడిపించుకుందని, ఆమెకు ఏదో తప్పు జరిగిందనితాను అనుకున్నానన్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ రెజ్లర్‌ పిరుదులను తాకిన సంఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో జగ్బీర్‌ సింగ్‌ పేర్కొనాురు. 2007 నుండి అంతర్జాతీయ రెజ్లింగ్‌ రిఫరీ ఉను జగ్బీర్‌ సింగ్‌ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రెజ్లర్‌ ఆరోపణలను ధృవీకరించారు. జగ్బీర్‌ సింగ్‌ ఫోటోను ప్రస్తావించారు. దానిగురించి ఢిల్లీ పోలీసులు తనను అడిగారని చెప్పారు. లకోులో గెలిచిన తరువాత ఫోటో తీసుకున్నప్పుడు పిరుదలపై చేయ వేసినట్లు తాను చూశానని అన్నారు.
''నేను ఆయనను (బ్రిజ్‌ భూషణ్‌) ఆమె పక్కన నిలబడి ఉండటం చూశాను. ఆమె తనను తాను విడిపించుకుని, దూరంగా నెట్టివేసి, గొణుగుతూ దూరంగా కదిలింది. ఆమె ప్రెసిడెంట్‌ పక్కన నిలబడి ఉంది. కానీ తర్వాత ముందుకువచ్చింది. ఈ మహిళా రెజ్లర్‌ ఎలా స్పందిస్తుందో నేను చూశాను. ఆమె అసౌకర్యంగా ఉంది. ఉస్కే సాథ్‌ కుచ్‌ గలాత్‌ హువా (ఆమెకుఏదో తప్పు జరిగింది). ఆయన ఆ పనిచేయడం నేను చూడలేదు. కానీ ఉస్కే హాత్‌ పెయిర్‌ ఖూబ్‌ చల్తే ది, ఇదార్‌ ఆ జా. ఇధర్‌ ఖాదీ హౌ జా (ఇక్కడకురండి, వచ్చి ఇక్కడ నిలబడండి అంటూ మల్లయోధులను తాకుతూ ఉండేవాడు). ఆమె (ఫిర్యాదుదారు) ప్రవర్తనను బట్టి, ఆ రోజు (ఫోటో సెషన్‌ సమయంలో) ఏదో తప్పు జరిగిందనిస్పష్టమైంది'' అని జగ్బీర్‌ అనాురు.
ఫోటో కోసం ముందు వరుసలోకి వెళ్లడానికి ముందు సింగ్‌ ఆమెను బలవంతంగా భుజం పట్టుకున్నాడు. ''నేను ఎత్తైన రెజ్లర్లలో ఒకరినికాబట్టి, నేను చివరి వరుసలో నిలబడవలసి ఉంది. నేను చివరి వరుసలో నిలబడి ఇతర మల్లయోధులు తమ స్థానాలను తీసుకుంటారనిఎదురు చూస్తుండగా, నిందితులు వచ్చి నా పక్కన నిలబడ్డారు. నాకుషాక్‌. ఆశ్చర్యానికి గురయ్యాను. నేను అకస్మాత్తుగా నా పిరుదులపై చేయి వేశారు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూసాను. భయానక స్థితికి లోనైయ్యాను. నిందితుడు నా పిరుదులపై తన చేతులు ఉంచాడు. నిందితుడు మరింత అనుచితంగా తాకకుండా ననుు రక్షించుకోవడానికి నేను వెంటనే ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లడానికి ప్రయతిుంచాను. అయితే, నేను దూరంగా వెళ్లడానికి ప్రయతిుంచినప్పుడు, నిందితులు ననుు బలవంతంగా నా భుజం పట్టుకునాురు. ఎలాగోలా నిందితుల బారి నుంచి బయటపడ్డాను. టీమ్‌ ఫోటోను క్లిక్‌ చేయడానిు నేను తప్పించుకోలేను కాబట్టి, నేను వెళ్లి నిందితులకుదూరంగా మొదటి వరుసలో కూర్చోవాలనినిర్ణయించుకునాును'' అనిఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది.ఒక ఒలింపియన్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ బంగారు పతక విజేత, అంతర్జాతీయ రిఫరీ, రాష్ట్ర స్థాయి కోచ్‌ ముగ్గురు మహిళా రెజ్లర్ల ఆరోపణలను ధృవీకరించారు. నాలుగు రాష్ట్రాల్లోని125 మంది సాక్షులలో జగ్బీర్‌ సింగ్‌ కూడా ఉనాురు. కామన్వెల్త్‌ క్రీడల బంగరు పతక విజేత అనిత, బయటకొచ్చి ఆధారాలను వెల్లడించిన రెండో సాక్షి జగ్బీర్‌. ఇద్దరు రెజ్లర్లు చేసిన వాదనలను ఈ ఇద్దరూ ధృవీకరించారు.

  • బ్రిజ్‌ భూషణ్‌ ఇంటికి రెజ్లర్‌ సంగీతా పోగట్‌ ను తీసికెళ్లిన ఢిల్లీ పోలీసులు

 

  • బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అధికారిక నివాసానికి ఢిల్లీ పోలీసులు రెజ్లర్‌ సంగీతా ఫోగట్‌ను

శుక్రవారం ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారు. సంగీతా ఫోగట్‌తో పాటు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని సమాచారం. అక్కడ లైంగిక వేధింపులకు దారితీసిన సీన్‌ రీక్రియేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ''శుక్రవారం మధ్యాహుం 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని బ్రిజ్‌ భూషణ్‌ అధికారిక నివాసానికి పోలీసులు మహిళా రెజ్లర్‌ సంగీతా ఫోగట్‌ను తీసుకెళ్లారు. ఆమె వెంట మహిళా కానిస్టేబుల్స్‌ కూడా ఉన్నారు. వారు అరగంట పాటు అక్కడే ఉన్నారు. ఆ దృశ్యానిు మళ్లీ రూపొందించాలని, ఆమె వేధింపులను ఎదుర్కొన్న ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోవాలని ఆమెను అడిగారు'' అనివిశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసింది. మహిళా రెజ్లర్‌ బ్రిజ్‌ భూషణ్‌ ఇంటికి వెళ్లలేదని, విచారణ కోసం పోలీసులు తీసుకెళ్లారని రెజ్లర్లు, ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా సిట్‌ 180 మందికి పైగా ప్రశిుంచినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
కాగా, సంగీతా ఫోగట్‌ కనిపించిన తరువాత బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌తో లైంగిక వేధింపుల సమస్యను రెజ్లర్లు పరిష్కరించుకుంటున్నారంటూ వస్తున వార్తలను రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా ఖండించారు. బ్రిజ్‌ భూషణ్‌ తన అధికారాన్ని ఉపయోగించి కథనాన్ని మార్చేస్తున్నాడని పేర్కొన్నారు. ''ఇది బ్రిజ్‌ భూషణ్‌ శక్తి. ఆయన తన కండబలం, రాజకీయ శక్తి, తప్పుడు కథనాలను ఉపయోగించి మహిళా రెజ్లర్లను వేధించడంలో బిజీగా ఉన్నాడు'' అని వినేష్‌ ఫోగట్‌ పేర్కొన్నారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ''పోలీసులు మమ్మలిు విడదీయడానికి బదులు ఆయనను అరెస్టు చేస్తే, న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది. లేకపోతే లేదు'' అని వినేష్‌ పేర్కొన్నారు. ''మహిళా రెజ్లర్లు పోలీసు విచారణ కోసం క్రైమ్‌ సైట్‌కు వెళ్లారని, అయితే వారు రాజీకి వెళ్లారని మీడియాలో ప్రచారం జరిగింది'' అని వినేష్‌ విమర్శించారు. ''తప్పుడు కథనాలను నడుపుతూ మహిళా రెజ్లర్లను బ్రిజ్‌ భూషణ్‌ ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు మమ్మల్ని విచ్ఛినుం చేసేందుకు ప్రయతిుస్తున్నారు'' అని బజరంగ్‌ పునియా అన్నారు.
అలాగే, బ్రిజ్‌ భూషణ్‌ ఇంటికి మహిళా రెజ్లర్లు వెళ్లడంపై తప్పుడు వార్తలు వస్తున్నాయని ఢిల్లీ పోలీసులు కూడా స్పష్టం చేశారు. ''దయచేసి పుకార్లను పట్టించుకోవద్దు. ఢిల్లీ పోలీసులు ఒక మహిళా రెజ్లర్‌ను విచారణ కోసం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయానికి తీసుకెళ్లారు'' అనిడిసిపి న్యూఢిల్లీ అధికారిక హ్యాండిల్‌ ట్వీట్‌ చేసింది. అదే సమయంలో తన నివాసానికి ఎవరూ రాలేదనిబ్రిజ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. రెజ్లర్ల ఆందోళన తప్పుడు సమాచారానికి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల, రెజ్లర్లు తమ రైల్వే విధులను తిరిగి ప్రారంభించిన తరువాత తమ నిరసనను ముగించినట్లు తప్పుడు ప్రచారం జరిగింది.

  • రెజ్లర్లు విద్వేష ప్రసంగాలు చేయలేదు : ఢిల్లీ పోలీసులు

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలు చేస్తును రెజ్లర్లు విద్వేష ప్రసంగాలు చేయలేదని, విచారించదగిన నేరానికి పాల్పడలేదని ఢిల్లీ పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై రెజ్లర్లు తప్పుడు ఆరోపణలు చేస్తునాురని, విద్వేషపూరితంగా మాట్లాడుతునాురని, వారిపై చర్యలు తీసుకోవాలని బమ్‌ బమ్‌ మహరాజ్‌ నౌహాటియా స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌లపై కేసు నమోదు చేయాలనికోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారని, విద్వేషపూరితంగా మాట్లాడారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై నివేదికను సమర్పించాలని మే 25న స్థానిక కోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ఈ నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఫిర్యాదుదారు సమర్పించిన వీడియోను ఢిల్లీ పోలీసులు ప్రస్తావిస్తూ, రెజ్లర్లు ఢిల్లీలోనిజంతర్‌ మంతర్‌ వద్ద విద్వేషపూరితంగా మాట్లాడలేదని, నినాదాలు చేయలేదని చెప్పారు. ఈ ఫిర్యాదును తోసిపుచ్చాలని కోర్టును కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 7న జరుగుతుంది.