Apr 04,2023 20:41

మొనాకో: మోంటే కార్లో ఓపెన్‌ టైటిల్‌ను 11సార్లు గెలుచుకున్న రఫెల్‌ నాదల్‌తో పాటు 2వ సీడ్‌ అల్కరాజ్‌ దూరమయ్యాడు. ఈ మేరకు వీరిద్దరూ ట్విటర్‌ వేదికగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 22గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత నాదల్‌ గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించగా.. అల్కరాజ్‌ ఫిట్‌నెస్‌ లేమి కారణంగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. నాదల్‌ 2005-12వరకు వరుసగా ఎనిమిదిటైటిళ్లతో ఓపెన్‌ ఎరా రికార్డుతో సహా 11 టైటిళ్లను నెగ్గాడు. 36ఏళ్ల నాదల్‌.. మే 28నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీ ఆదివారం నుంచి యూరోప్‌లో ప్రారంభం కానుంది.