Mar 21,2023 21:35
  • బెంగళూరుపై 4వికెట్ల తేడాతో గెలుపు

ముంబయి: చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ మహిళల జట్టు ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి 4వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ మహిళలపై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 125పరుగులు చేసింది. స్మృతి మంధాన(24), ఎలీసా ఫెర్రీ(29), రీచా ఘోష్‌(29) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ముంబయి బౌలర్లు అమేలియా కెర్ర్‌కు మూడు, స్కీవర్‌ బ్రంట్‌, వాంగ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబయి జట్టు 16.3 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 129పరుగులు చేసి గెలిచింది. మాథ్యూస్‌(24), యస్టికా భాటియా(30)కి తోడు అమేలియా కెర్ర్‌(31నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. బెంగళూరు బౌలర్లు కనిక అహూజకు రెండు, స్కట్‌, పాటిల్‌, ఎలీసా, శోభనకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అమేలియా కెర్ర్‌కు లభించింది. దీంతో ముంబయి జట్టు 8మ్యాచుల్లో ఆరో విజయాన్ని సాధించింది.