Jul 29,2023 19:25

భద్రాచలం: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. శనివారం భద్రాచలం పరిధిలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఏరియల్‌ సర్వే చేశారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిరశీలించి, పలు సూచనలు చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 12వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మంత్రి చెప్పారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని.. రేపటి నుంచి వదర ఉద్ధఅతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. పునరావాస కాలనీ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.2 అడుగుల వద్ద కొనసాగుతోంది.