Jan 16,2023 11:58

బెంగళూరు : భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 16 వ తేదీ నుంచి తమ మోడల్స్‌ కార్ల ధరలను సగటున 1.1 శాతం పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన వ్యయం కారణంగా జనవరి నెలలో కార్ల ధరలను పెంచాల్సి ఉంటుందని డిసెంబర్‌ నెలలో మారుతీ ప్రకటించింది. మారుతీ సుజుకి ఈరోజు నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచింది.