ఇండోర్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 379పరుగులు చేసింది. తొలిరోజు వికెట్ కీపర్ రికీ బుయ్ సెంచరీ చేయగా.. రెండోరోజు కరణ్ షిండే(110) కూడా సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ ఔటయ్యాక లలిత్ మోహన్(22) మాత్రమే బ్యాటింగ్‌లో ఫర్వాలేదనించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఘోరంగా విఫలమయ్యారు. అనుభవ్ అగర్వాల్‌కు నాలుగు, కార్తికేయ, గౌరవ్ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శుభమ్ శర్మ(51) అర్ధసెంచరీకి తోడు ఓపెనర్లు యశ్ దూబే(20), హిమాన్షు(22), పటీధర్(20) ఫర్వాలేదనిపించారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ శ్రీవాత్సవ(20), అనుభవ్ అగర్వాల్(0) క్రీజ్‌లో ఉన్నారు. శశికాంంత్‌కు రెండు, నితీశ్ కుమార్, పృథ్వీరాజ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
ఇతర క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో జార్ఖండ్‌పై బెంగాల్ జట్టు ఇప్పటికే 65పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను సంపాదించింది. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173పరుగులకు ఆలౌట్ కాగా.. బెంగాల్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 5వికెట్లు నష్టపోయి 238పరుగులు చేసింది. మరో పోటీలో పంజాబ్ జట్టు సౌరాష్ట్రపై 24పరుగుల ఆధిక్యతను, ఉత్తరాఖండ్‌పై 358పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను కర్ణాటక సంపాదించింది.










