Feb 03,2023 21:51

ఛండీగడ్‌: టీమిండియా 2007లో టీ20 ప్రపంచకప్‌ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన జోగిందర్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. 2004లో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న జోగిందర్‌.. టీమిండియా తరఫున కేవలం నాలుగు వన్డేలు, మరో నాలుగు టి20లను మాత్రమే ఆడాడు. 2007లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచే అతడి చివరి టి20 కావడం గమనార్హం. 2008 నుంచి 2012 వరకు ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన జోగిందర్‌కు.. జాతీయ జట్టు తరఫున అవకాశాలు రాలేదు. 2007లో హర్యానా పోలీస్‌ శాఖలో ఉద్యోగంలో చేరిన జోగిందర్‌.. నేడు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌నుంచి వైదొలుగుతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.