విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ అన్నారు. ఆయన ఆరోగ్యం బాలేదంటే ఎగతాళిగా మాట్లాడతారా?అని మండిపడ్డారు. ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలి గానీ.. డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.మరోవైపు, ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసిపి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ''కఅష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సదస్సు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ పున్ణపంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి మరీ దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.