Aug 07,2023 12:35

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. బాబు పేరు కోవా ఫినిక్స్‌ డోలన్‌గా పెట్టినట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన బాబుకి జన్మనిచ్చినట్లు ఇలియానా శనివారం (ఆగస్టు 5వ తేదీ) రోజు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె బాబు ఫొటోతోపాటు, తాను బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ఇలియానా 'మా డార్లింగ్‌ బారుని ప్రపంచానికి స్వాగతించినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. పండింట్‌ జగన్నాథ్‌ గురూజీ చెప్పిన ప్రకారం బాబుకి కోవా ఫీనిక్స్‌ డోలన్‌ అనే పేరును పెట్టాము. కోవా అనే పేరు హవాయిలో 'యోధుడు' అని అర్థం. ఫీనిక్స్‌ పునర్జన్మ మరియు పునరుద్ధరణకు చిహ్నం. సవాళ్లను ఎదుర్కొనేందుకు భయపడని ఈ బిడ్డ దృఢంగా, ధైర్యంగా ఉంటాడని ఈ రెండు పేర్ల కలయిక సూచిస్తుంది' అని ఆమె తాను చేసిన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ఇలియానా తెలుగులో 'దేవదాసు' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పోకిరి' చిత్రంలో మహేష్‌బాబుకి జోడీగా నటించారు. పోకిరి చిత్రంతో ఇలియానా మంచి పేరు సంపాదించుకుంది. ఎన్టీఆర్‌తో 'రాఖీ', రవితేజతో 'కిక్‌' సినిమాల్లో నటించి అలరించారు. గత కొన్నేళ్లుగా ఇలియానా తెలుగు ఇండిస్టీకి దూరంగా ఉన్నారు. కేవలం బాలీవుడ్‌ చిత్రాల్లోనే నటిస్తున్నారు.

 

iliyana baby bump and boy pic