హైదరాబాద్: రెండు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడనున్నట్లు తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ల్లో అలర్ట్ జారీ చేసింది










