ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ సెమీస్‌లో అడుగు పెట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్‌లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్‌లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్‌పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది.










