పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రపంచ 2వ ర్యాంకర్, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకా ప్రవేశించింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సబలెంకా 6-4, 6-4తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్విటోలీనాపై వరుససెట్లలో నెగ్గి కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరింది. బిడ్డ తల్లి అయిన స్విటోలీనా ప్రత్యర్ధి ఫోర్‌హ్యాండ్ షాట్‌ల మధ్య నిలువలేకపోయింది. సెమీస్‌లో సబలెంకా.. కరోలినా ముఛోవా(చెక్ రిపబ్లిక్)తో తలపడనుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో ముఛోవా(చెక్ రిపబ్లిక్) 7-5, 6-2తో పొవెంచికోవా(రష్యా)పై సునాయాసంగా విజయం సాధించి సెమీస్‌కు చేరింది.










