Dec 24,2022 12:58

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : వైయస్సార్‌ క్రాంతి పదం మహిళా సాధికార సంస్థకు చెందిన ఆలమూరు ఏపీఎం ఎం.ధనరాజు ఆదేశాల మేరకు స్థానిక వివోఏల ఆధ్వర్యంలో మండలంలోని మడికిలో సర్పంచ్‌ ఉండ్రాజపు లక్ష్మి మౌనిక చిన్నకు శనివారం రుణమాఫీ అర్హత జాబితాను అందజేసి నోటీస్‌ బోర్డ్‌ నందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక అభివఅద్ధి లక్ష్యంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు. ఈ జాబితాను పరిశీలించుకుని అర్హత గల వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయాలని స్థానిక వివోఏలకు తెలియజేయాలని తెలిపారు. తద్వారా వారి సమస్యలు పరిష్కరించబడతాయని ఇది ప్రతి ఒక్కరు ఈ జాబితాలు చూసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల అందజేసిన ప్రతి సభ్యురాలు తమ గుర్తింపు కార్డును మీ పరిధిలో విఓఎల ద్వారా పొందాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో యానిమేటర్లు సిహెచ్‌.హర్షవర్ధని, కె.సత్యవేణి, సిహెచ్‌.దుర్గాదేవి, ఎం.గన్నమ్మ, సిహెచ్‌.లక్ష్మీపార్వతి, డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు.