Dec 03,2022 13:30

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలోని ఎన్‌జి.పాలెం పంచాయతీలో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం (డ్వాక్రా మహిళలు కు రుణమాఫీ) 3 వ విడత రుణమాఫీ నిమిత్తం ప్రతీ డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆధార్‌ నెంబర్‌, వారి పొదుపు ఖాతా నెంబర్‌ను శనివారం నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కలిగట్ల నూకరత్నం ఉన్నారు. వెలుగు సీసీలు, విఓఏ లతో యుద్ధ ప్రాతిపదికన సభ్యులు బెయిమెట్రిక్‌ లు వేయిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఎమ్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ ... కశింకోట మండలంలోని 1537 స్వయం సహాయక సంఘాలకి 15805 డ్వాక్రా మహిళలకి ప్రతీ ఏడాది 13 కోట్ల 27 లక్షలను సభ్యుల ఖాతాలకు వేస్తామన్నారు. ఈ 3 వ విడత ఆసరా పథకం అమౌంట్‌ ను వచ్చే సంవత్సరం జనవరి నెలలో జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సి సి లు శ్రీను, రామకృష్ణ, విఓఏ లు టి.నాగమణి, లక్ష్మీ, ఆదిలక్ష్మి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.