ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : వైఎస్సార్ క్రాంతి పథం మహిళా సాధికార సంస్థ చెందిన ఆలమూరు ఏపీఎం ఎం.ధనరాజు ఆదేశాల మేరకు స్థానిక వివోఏల ఆధ్వర్యంలో మండలంలోని బడుగువానిలంకలో సర్పంచ్ దూలం వెంకటలక్ష్మి, వైసిపి సీనియర్ నేత దూలం సత్తిబాబు దంపతుల చేతుల మీదుగా మంగళవారం గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ... ఈ కార్డులతో ప్రభుత్వ పథకాలలో అర్హత పొంది నిజమైన లబ్ధిదారులుగా గుర్తింపు పొందుతారన్నారు. ప్రతి సభ్యురాలు తమ గుర్తింపు కార్డును వారి పరిధిలో విఓఎల ద్వారా పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యు.సుప్రియ, ఉప సర్పంచ్ పినమాల జ్యోతి తాతాజీ, వైసిపి నేతలు కర్రీ నాగిరెడ్డి, కటారి గంగరాజు, వారా శ్రీధర్, కటారి కుమార్, అంబేద్కర్, యానిమేటర్లు పసుపులేటి మేరీ గ్రేస్, అలమండ ధనలక్ష్మి, డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు.










