May 27,2023 10:06

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : 'వ్యర్థాలే వారికి ఉపాధి' శీర్షికన 'ప్రజాశక్తి' ప్రధాన సంచికలో ఈ నెల 24న ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. సంబంధిత అధికారులకు తిరుపతి జిల్లా డ్వామా పిడి శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఫోన్‌ చేసి వెంటనే ఆ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన వారికి జాబ్‌కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రామచంద్రాపురం మండల ఎపిఒ హంసవేణి 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ.. రామాపురం డంపింగ్‌ యార్డు వద్ద నివసిస్తున్న యానాదుల దగ్గర 'జాబ్‌కార్డులు' సేకరిస్తున్నామని, జూన్‌ 1న వారితో సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ జాబ్‌కార్డులు ఇచ్చి ఉపాధి పనులు కల్పిస్తామని చెప్పారు.