Jun 05,2023 14:51

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నొవాక్‌ జకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. 17వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించి.. రఫెల్‌ నాదల్‌ 16సార్లు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరిన రికార్డును జొకో బ్రేక్‌ చేశాడు. నిన్న రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్‌ జకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో పెరూ ఆటగాడు యువాన్‌ పాబ్లో (పెరూ)పై గెలిచాడు. దాంతో, క్వార్టర్‌ ఫైనల్‌ చేరి పురుషుల సింగిల్స్‌లో అత్యధికంగా 23 గ్రాండ్‌ స్లామ్స్‌ అందుకునేందుకు మరింత చేరువయ్యాడు. పపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) కూడా క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6-2, 6-2తో ఇటలీ ప్లేయర్‌ లోరెంజో ముసెట్టిపై గెలిచాడు.