Aug 17,2022 13:08

తిరువూరు (ఎన్‌టిఆర్‌) : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల, మేకలకు ఉచితంగా నట్టల నివారణమందును బుధవారం పంపిణీ చేశారు. తిరువూరు మండలం వావిలాల గ్రామంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందు తాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అలవాల.రాధ, డాక్టర్‌ టి.శ్వేత, వి.ఏ.యస్‌ యం.గోపాలకఅష్ణ, వి.యల్‌.ఓ గొర్రెల, మేకల సంఘ అధ్యక్షులు కార్యదర్శి, రాజావరపు నరసింహం, దంతేలపల్లి వెంకటేశ్వరరావు, కె.వి.నారాయణ, యల్‌.యస్‌.ఏ. రైతు భరోసా కేంద్ర సిబ్బంది, సి,హెచ్‌.నాగేంద్రబాబు, గొర్రెల, మేకల పెంపకందారులు పాల్గొన్నారు.