ఢిల్లీ : డోపింగ్ టెస్టుల్లో భారత జిమ్నాస్టర్ దీపా కర్మాకర్ పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. అయితే.. 2021 అక్టోబర్‌లోనే ఆమె డోపింగ్‌లో పట్టుబడింది. ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది.










