గత ఏడాది చివరన రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన పంత్ కారు డివైడర్‌ను ఢకొీని బోల్తా కొట్టింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిస్ చేసుకున్న రిషబ్ పంత్‌కు ఇప్పుడు ఐపీఎల్‌లో కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2023కి సంబంధించి రిషబ్ పంత్‌ను కెప్టెన్ స్థానం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. వైస్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటన చేసింది.
POV: Imagining Captain Davey arriving at #QilaKotla via the nearest #DelhiMetro 🐯🚇
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
Dilli, it's time to roar together this #IPL2023 with David Warner (𝗖) ❤💙#YehHaiNayiDilli | @davidwarner31 pic.twitter.com/xzEoWhKyyR










