హైదరాబాద్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మఅతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారని కొనియాడారు. ఆయన కృషి వల్లే ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమఅద్ధి సాధించిందన్నారు. రైతుల గుండెల్లో స్వామినాథన్ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ తెలిపారు.










