Feb 04,2023 22:15

ఫైనల్లో బ్రిస్బేన్‌ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో బ్రిస్బేన్‌ హీట్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఐదోసారి బిగ్‌బాష్‌ లీగ్‌ ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు క్రియేట్‌ చేసింది. జిమ్మీ పియెర్సన్‌ నాయకత్వంలోని బ్రిస్బేన్‌ హీట్‌ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్‌ చేసింది. బ్రిస్బేన్‌ హీట్‌ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌ నాథన్‌ మెక్‌స్వీన్‌ (41) టాప్‌ స్కోరర్‌. 176 టార్గెట్‌ చేధనలో పెర్త్‌ స్కార్చర్స్‌ ఆటగాడు ఆష్టన్‌ టర్నర్‌ హాఫ్‌ సెంచరీ (51)తో రాణించాడు. చివర్లో కూపర్‌ 11 బంతుల్లో 25 రన్స్‌ చేయడంతో ఆ జట్టు 19.2 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించింది. పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు 2014, 2015, 2017, 2022లో బిగ్‌బాష్‌ లీగ్‌ ఛాంపియన్‌గా అవతరించింది.
300 వికెట్ల క్లబ్‌లో ఆండ్రూ టై
ఈ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ బౌలర్‌ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ ఫార్మాట్‌లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సఅష్టించాడు. జేమ్స్‌ బజిలేను ఔట్‌ చేసి 300 వికెట్‌ సాధించాడు. ఈ ఆస్ట్రేలియా పేసర్‌ 211 మ్యాచుల్లోనే 300 వికెట్లు తీసి రషీద్‌ ఖాన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. రషీద్‌ 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు.