పుట్టపర్తి (సత్యసాయి) : పుట్టపర్తి పట్టణంలో ఈ నెల మూడవ తేదీన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ మహాసభలలో నూతన ఎస్‌ఎఫ్‌ఐ కమిటీని 19 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా కమిటీకి కార్యదర్శిగా బాబావలిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మాట్లాడుతూ ... రాబోవు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని, విద్య కాషాయికరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.










