Feb 08,2023 08:30
  • ఛైర్మన్‌గా కె రాంబాబు
  • అన్నవరం, ద్వారకా తిరుమలకూ కొత్త కమిటీలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి (కనకదుర్గ దేవస్థానం) 15 మంది సభ్యులతో పాలకమండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. బోర్డు సభ్యులు ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. సభ్యులుగా కర్నాటి రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవికృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమానూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణ వేణి, తొట్టాది వేదకుమారిని ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకుడును నియమించింది. కర్నాటి రాంబాబును ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.
 

                                                                     అన్నవరం దేవస్థానానికి..

అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి 14 మంది సభ్యులతో ప్రభుత్వం నూతన కమిటీని ప్రకటించింది. ఆలయ ఛైర్మన్‌గా ఎల్‌వి రోహిత్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎం)ను నియమించారు. ద్వారకా తిరుమల ఆలయానికి కూడా 15 మంది సభ్యులతో నూతన పాలకమండలి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆలయ ఛైర్మన్‌గా ఎస్‌వి సుధాకర్‌రావు (ఎఫ్‌ఎఫ్‌ఎం)ను నియమించింది.